: పోలీసుల అదుపులో శ్రీ అభయ గోల్డ్ ఎండీ
విజయవాడ కేంద్రంగా రియల్ ఎస్టేట్ రంగంలో సేవలందిస్తున్న శ్రీ అభయగోల్డ్ ఇన్వెస్టర్లను వంచించినట్లు తెలుస్తోంది. అధిక వడ్డీ ఆశజూపి ఇన్వెస్టర్ల నుంచి వందలాది కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు అభయగోల్డ్ ఎండీ శ్రీనివాసరావును హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. విచారణ కోసం ఆయనను విజయవాడకు తరలించినట్లు తెలుస్తోంది.