: 'సన్' టిమెంట్ వర్కౌటయ్యేనా?
ఐపీఎల్-6లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 130కి అటూఇటూగా స్కోరు సాధించిన సందర్భాల్లో మాత్రమే నెగ్గిందన్నది గణాంకాలు చెప్పే వాస్తవం. ఢిల్లీ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో ఎలిమినేటర్ పోరులోనూ సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసింది. ధావన్ 33, కెప్టెన్ వైట్ 31, సామీ 29 పరుగులు చేశారు. సన్ రైజర్స్ జట్టును రాయల్స్ బౌలర్ విక్రమ్ మాలిక్ ఆరంభంలోనే రెండు వికెట్లు తీసి దెబ్బతీశాడు. కాగా, భారీ స్కోర్లు నమోదు చేసిన మ్యాచ్ లలో హైదరాబాద్ జట్టు ఇప్పటిదాకా విజయం సాధించిందిలేదు. ఈ నేపథ్యంలో 'స్వల్ప స్కోరు' సెంటిమెంటు వర్కౌటవుతుందేమో చూడాలి.