: ఫిక్సింగ్ చేయమని ఏప్రిల్ లోనే చండీలాకు డబ్బులందాయి
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ పై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసారు. మే 17న జరిగిన రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో స్పాట్ ఫిక్సింగ్ చేసేందుకు అజిత్ చండీలాకు 15 లక్షల రూపాయలు అందాయని పోలీసులు తెలిపారు. అయితే అప్పటికే స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం బయటపడి అజిత్ చండీలా అరెస్టు కావడంతో స్పాట్ ఫిక్సింగ్ కుదరలేదంది. అజిత్ చండీలాకు బుకీలు ఏప్రిల్ లోనే ఫిక్సింగ్ డబ్బులు చెల్లించారని, అజిత్ చండీలా క్రికెట్ కిట్ నుంచి 20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. బాబూరావు సహాయంతో ఐసీఎల్ మ్యాచ్ ల్లో ఫిక్సింగ్ కు పాల్పడినట్లు సునీల్ భాటియా ఒప్పుకున్నాడని తెలిపారు. ఐసీఎల్ ఆటగాళ్ళ నిషేదం తరువాత సునీల్ భాటియా బాబూరావును బంగ్లాదేశ్ తీసుకెళ్ళాడని, బుకీ భాటియాకు ప్రముఖ బంగ్లాదేశ్ ఆటగాడితో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు.