చిన్నారుల అక్షరాభ్యాసాలకు ప్రముఖ దివ్యక్షేత్రం బాసరను మించిన వేదిక ఏముంటుంది. గురువారం వసంత పంచమి కావడంతో భక్తులు పోటెత్తారు. ఇక్కడి సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే క్యూలు కట్టారు. ఉదయం 5 గంటల నుండే చిన్నారులకు పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు కొనసాగుతున్నాయి. కాగా, శుక్రవారం నాడు అమ్మవారి జన్మదినం ఘనంగా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ సిబ్బంది వెల్లడించారు.