COVID-19: ఐదు నెలల తర్వాత నేడు తెరుచుకోనున్న అనంత పద్మనాభస్వామి ఆలయ తలుపులు
- కొవిడ్ కారణంగా మార్చి 21న మూతపడిన ఆలయం
- కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం
- రోజుకు గరిష్ఠంగా 665 మంది భక్తులకు మాత్రమే అనుమతి
కరోనా వైరస్ కారణంగా మూతపడిన కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం నేడు తెరుచుకోనుంది. పూర్తిస్థాయిలో కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ భక్తులను అనుమతించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దర్శనం కోసం భక్తులు ఆలయ వెబ్‌సైట్ www.spst.inలో బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రోజుకు 665 మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నట్టు తెలిపారు. కాగా, కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది మార్చి 21న ఆలయాన్ని మూసివేశారు. ఐదు నెలల తర్వాత ఆలయాన్ని తెరుస్తుండడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.