: తక్షణ శక్తికి టమాటా రసం మేలంటున్న పరిశోధకులు


తక్షణ శక్తి పొందడానికి మనం రకరకాల ఖరీదైన పానీయాల కోసం వెంపర్లాడతాం. అయితే మనింట్లోనే చౌకగా దొరికే టమాటా రసం వీటికన్నా చాలా మేలని పరిశోధకులు తేల్చిచెబుతున్నారు. వ్యాయామం, శారీక శ్రమ అనంతరం టమాటా రసం తీసుకుంటే తక్షణ శక్తి వస్తోందని వీరి పరిశోధనలు రుజువు చేశాయి.

రక్తనాళాలు సాధారణ స్థితికి రావడానికి, కండరాలు పుంజుకోవడానికి అవసరమయ్యే రసాయనాలు టమాటా రసంలో దండిగా వున్నాయని పరిశోధన పేర్కొంది. ఈ రసం తాగిన వారి రక్తంలో గ్లూకోజు స్థాయిలు కూడా సాధారణ స్థితికి చేరుతున్నట్టు ప్రయోగాత్మకంగా రుజువైంది. కాబట్టి... ఈసారి మీరు కూడా టమాటా రసం ట్రై చేసి చూడండి      

  • Loading...

More Telugu News