: సన్ రైజర్స్ ఫైనల్ కా.. ఇంటికా?
ఇప్పటి వరకూ ఆడింది ఒక ఎత్తు. ఇప్పుడు ఆడే మ్యాచులు ఒక ఎత్తు. డెక్కన్ చార్జర్స్ జట్టు రద్దయ్యి సన్ రైజర్స్ గా అవతరించిన హైదరాబాద్ జట్టు తన జాతకాన్ని మార్చుకుని ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. ఈ రోజు, 24న రెండు మ్యాచులలో గెలిస్తే సన్ రైజర్స్ కు ఫైనల్ బెర్త్ ఖాయం. ఈ రోజు రాజస్థాన్ జట్టుతో సన్ రైజర్స్ ఢిల్లీ వేదికగా తలపడుతుంది. రాత్రి 8 గంటలకు వీటి మధ్య మ్యాచ్ మొదలవుతుంది. ఇందుకోసం సన్ రైజర్స్ ఆటగాళ్లు బానే కసరత్తు చేశారు.