: డైలమాలో పుణే ఆటగాళ్ళ భవితవ్యం?


సహారా గ్రూప్ ఆర్ధికంగా కుదేలవడంతో పుణే వారియర్స్ ఫ్రాంచైజీ వచ్చే ఐపీఎల్ సీజన్లో పాల్గొనే అవకాశం కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, పుణే జట్టు లీగ్ నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఆ జట్టు ఆటగాళ్ళ పరిస్థితి అయోమయంలో పడింది. పుణే జట్టులో యువరాజ్ సింగ్, మైకేల్ క్లార్క్, రాబిన్ ఊతప్ప, ఏంజెలో మాథ్యూస్, రాస్ టేలర్, మార్లోన్ శామ్యూల్స్, ల్యూక్ రైట్, భువనేశ్వర్ కుమార్, అజంత మెండిస్, మిచెల్ మార్ష్, అశోక్ దిండా వంటి స్టార్ క్రికెటర్లున్నారు. వీరి భవితవ్యం ఇప్పుడు అనిశ్చితిలో పడింది.

సహారా యాజమాన్యం గత కొద్దికాలంగా ఆర్ధికనష్టాలు చవిచూస్తున్న నేపథ్యంలో వీరి పారితోషికాలు కూడా చెల్లించలేదని తెలుస్తోంది. ఈ ఆటగాళ్ళ భవిష్యత్ పై ఐపీఎల్ నిర్వాహకులు ఇంకా స్పందించాల్సి ఉంది. వచ్చే సీజన్ కు గాను వీరిని వేలంలో ఉంచడమా, లేక, ఆటగాళ్ళ బదలాయింపుల్లో భాగంగా ఇతర జట్లకు కేటాయించడమా అన్నది త్వరలోనే తేలనుంది.

  • Loading...

More Telugu News