: టోర్నడో మృతులు 91 మందిలో చిన్నారులు 20 మంది
అమెరికాలోని ఓక్లహామ సిటీలో సోమవారం మధ్యాహ్నం సంభవించిన టోర్నడో మృతుల సంఖ్య 91కి చేరుకుంది. అందులో 20 మంది చిన్నారులున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 145 మంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో సగం మంది బాలలేనని సమాచారం. శిధిలాలను తొలగించే సహాయ చర్యలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పలునివాస భవనాలు, రెండు పాఠశాల భవనాలు, ఆసుపత్రులు ఉన్న పళాన నేలమట్టమైపోయాయి. స్కూలు శిధిలాల నుంచి చాలామందిని కాపాడినా, చాలామంది జాడ తెలియడం లేదని స్థానిక అధికారులు పేర్కొన్నారు. కార్లన్నీ తుక్కుతుక్కు అయ్యాయని, గాలి 320 కిలోమీటర్ల వేగంతో వీచిందని అధికారులు తెలిపారు.