: కేన్స్ సంబరాల్లో వందేళ్ళ భారతీయ సినిమా వేడుక
కేన్స్ చిత్రోత్సవంలో వందేళ్ళ భారతీయ సినిమా వేడుకలు సంబరంగా జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కేన్స్ కి భారతీయ చిత్రపరిశ్రమలోని ప్రముఖులు పలువురు హాజరయ్యారు. లెజెండ్ గా అమితాబ్ బచ్చన్ హాజరవగా, అతని కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ నటి విద్యాబాలన్ జ్యూరీ సభ్యురాలిగా రంగురంగుల సంప్రదాయ చీరలో కేన్స్ ఆరంభం నుంచీ అందర్నీ ఆకట్టుకుంటున్నారు.
కేంద్ర పర్యాటక శాఖా మంత్రిగా ప్రముఖ తెలుగు హీరో చిరంజీవి హాజరుకాగా, తెలుగు సినీ రంగం నుంచి యువహీరో రాం చరణ్, కార్తికేయ హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి స్లమ్ డాగ్ మిలియనీర్, లైఫ్ ఆఫ్ పై సినిమాతో పలు అవార్డులు గెలుచుకున్న ఇర్ఫాన్ ఖాన్ గౌరవ అతిథిగా హాజరుకాగా, మల్లికాశరావత్, అనురాగ్ కశ్యప్, జోయాఅక్తర్, కరన్ జోహార్, దివాకర్ బెనర్జీ హాజరయ్యారు. అన్నింటికంటే ముఖ్యంగా భారత దేశాన్ని ప్రత్యేక అతిథి దేశంగా కేన్స్ చిత్రోత్సవం గుర్తించింది.