: లైంగిక వేధింపులతో పదవిని కోల్పోయిన ఐగేట్ సీఈఓ
ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఐగేట్ సీఈఓ ఫణీష్ లైంగిక వేధింపుల విషయంలో మరోసారి బుక్కయ్యారు. భారతీయుడైన ఫణీష్ తన కింది ఉద్యోగినితో లైంగిక సంబంధం నడుపుతున్నట్లు, వేధింపులకు పాల్పడుతున్నట్లు కంపెనీ నియమించిన విచారణ కమిటీ నిర్ధారించింది. దీంతో ఫణీష్ ను సీఈఓ పదవి నుంచి తొలగిస్తూ ఐగేట్ నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక సీఈఓగా గెర్హార్డ్ వాట్ జింగర్ నియమితులయ్యారు.
ఫణీష్ ఇలా లైంగిక వేధింపులతో పదవిని కోల్పోవడం ఇది రెండోసారి. 1992లో ఇన్ఫోసిన్ కంపెనీలో అమెరికా మార్కెటింగ్ మేనేజర్ గా ఫణీష్ చేరారు. అనంతరం ఇన్ఫోసిన్ అంతర్జాతీయ విక్రయాల విభాగం హెడ్ గా పదోన్నతి పొందారు. 2002లో ఫణీష్ సెక్రటరీ రేఖ తన బాస్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో ఫణీష్ ఇన్ఫోసిస్ కు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఐ గేట్ లో చేరి సీఈఓ స్థాయికి చేరుకున్న ఫణీష్ తన సహజసిద్ధ ప్రవర్తన కారణంగా మరోమారు పదవి ఊడగొట్టుకున్నారు.