: హమ్మయ్య... వేడి తక్కువగా ఉంది!


భూమి త్వరగా వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్న నేపధ్యంలో తాజా అధ్యయనం కాస్తా ఆనందాన్ని కలిగిస్తుంది. భూమి అనుకున్నదానికన్నా తక్కువగా వేడెక్కుతోందని ఈ తాజా అధ్యయనం వెల్లడిరచింది.

వాతావరణంలోని మార్పులపై ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థ (ఐపీసీసీ) 2007లో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో స్వల్పకాల వ్యవధిలో భూతాపం 1`3 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరగనుందని పేర్కొంది. కానీ వివిధదేశాల శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ పెరుగుదల 0.9`2.0 డిగ్రీల సెల్సియస్‌ మాత్రమే ఉండే అవకాశం ఉందని తేలింది. 1998 నుండి భూమి ఉష్టోగ్రతలు దాదాపుగా స్థిరంగా ఉన్నాయని, వాతావరణంలోని వేడిని సముద్రాలు అధికమొత్తంలో గ్రహిస్తున్న నేపధ్యంలో భూమి ఉష్ణోగ్రత స్థిరంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనివల్ల రానున్న కొన్ని దశాబ్దాల కాలంపాటు భూమి ఉష్ణోగ్రత ముందుకన్నా 20 శాతం తక్కువ రేటుతో పెరిగే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే సుదీర్ఘ కాలానికి సంబంధించిన భూతాప పెరుగుదలకు సంబంధించి అంతకుముందు జరిగిన పరిశోధనల్లో వెలువడిన అంచనాల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని, తమ అధ్యయనం కూడా ఆ అంచనాలతో ఏకీభవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే... సుదీర్ఘకాలంలో భూతాపం పెరిగిపోతుంది... కానీ కొంతకాలంపాటు మాత్రం ఈ పెరుగుదల కాస్త తక్కువ వేగంతో ఉంటుందన్నమాట...! మరి భూతాపం పెరగకుండా మనం కూడా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే ఈ వేగం మరికాస్త మందగించే అవకాశం ఉందిగా...!

  • Loading...

More Telugu News