: కథ ముగియలేదంటున్న జహీర్ ఖాన్
విడవని గాయాలు, దొరకని ఫామ్.. ఈ సమస్యలతో కొన్నాళ్ళ వరకు సతమతమైన సీనియర్ పేసర్ జహీర్ ఖాన్ మళ్ళీ మైదానంలో అడుగుపెట్టాడు. శారీరక బాధల నుంచి కోలుకుని, ఇటీవలే ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరుపున లీగ్ మ్యాచ్ లలో బంతి పట్టాడు. ఓ మోస్తరుగా రాణించిన జహీర్ తన ఫిట్ నెస్ పై మాత్రం పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. త్వరలోనే జాతీయ జట్టులోనూ స్థానం సంపాదిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. గత డిసెంబర్ లో ఇంగ్లండ్ తో మూడో టెస్టు సందర్భంగా టీమిండియాలో చోటు కోల్పోయిన జహీర్.. తన పునరాగమనంపై తహతహలాడుతున్నాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఫిట్ నెస్ పై మరింత దృష్టి పెడతానని చెప్పాడు.