: 'దర్యాప్తు పూర్తయ్యే వరకూ ఐపీఎల్ ఆపాలి'
స్పాట్ ఫిక్సింగ్ ఉచ్చు ఐపీఎల్ మెడకు బిగుసుకుంటోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు ఆటగాళ్ళు అరెస్టు అయినందున, మరింతమంది క్రీడాకారులు, మ్యాచ్ లపై ఆరోపణలు ఉన్నందువల్ల దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఐపీఎల్ నాకౌట్, ఫైనల్స్ మ్యాచ్ లు జరుగకుండా టోర్నీని తక్షణం ఆపాల్సిందిగా ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఒక న్యాయవాది ఈ పిటీషన్ దాఖలు చేసారు. ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు.