: సౌరవిద్యుత్తు ప్రాజెక్టులకు గుజరాత్ అధికారుల సేవలు
రాష్ట్ర ప్రభుత్వం సౌరవిద్యుత్తు విధానం ప్రకటించడంతో గుజరాత్ విద్యుత్తు పరిశోధన సంస్థ అధికారులు తమ సేవలు రాష్ట్రానికి అందించనున్నారు. హైదరాబాద్ లో సోమవారం గుజరాత్ ఎనర్జీ రీసెర్చ్ మేనేజ్ మెంట్ ఇన్స్టిట్యూట్(జెర్మీ) నెడ్ క్యాప్ తో కలిసి సౌరవిద్యుత్తు కేంద్రాలు ఏర్పాటు చేసుకునే ఔత్సాహికుల కోసం సదస్సు నిర్వహించారు. సౌరవిద్యుత్తు పరికరాలు కొనుగోలు చెయ్యడం మొదలుకుని, ప్రాజెక్టు ఏర్పాటు చేసుకుని గ్రిడ్ కు అనుసంధానించే వరకూ అన్ని విషయాలపై అవగాహన కల్పించారు. జెర్మీ సంస్థ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు, నిపుణులు సౌరవిద్యుత్తు కేంద్రాలను మూడేళ్ళుగా నిర్వహిస్తున్నందున వీటి ఏర్పాటుకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తున్నట్టు తెలిపారు.