: సామాజిక న్యాయం అన్నవాళ్ళు సొంత న్యాయం చూసుకున్నారు: లోకేశ్
టీడీపీ యువ నేత నారా లోకేశ్ నేడు కరీంనగర్ జిల్లా కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక న్యాయం, సామాజిక సేవ అన్న వాళ్ళు సొంత న్యాయం చూసుకుని చెక్కేశారని పరోక్షంగా కేంద్రమంత్రి చిరంజీవినుద్ధేశించి వ్యాఖ్యానించారు. ఇక, కలెక్షన్ కింగ్ లను ఆదర్శంగా తీసుకోవద్దని వారికి సూచిస్తూ, కార్యకర్తలే ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. అలాంటివారిని స్ఫూర్తిగా తీసుకుంటే సమాజానికి చేటు తప్పదని హెచ్చరించారు. టీడీపీకి సొంత పత్రిక, చానల్ లేవని, ఉంటే, తాము కూడా జైల్లో ఉండేవారమని లోకేశ్ వ్యంగ్యోక్తి విసిరారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని దారిలో పెట్టాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందంటూ వారికి కర్తవ్యబోధ చేశారు.