: ఇక తెరపై శ్రీశాంత్ విషాధ గాథ
కాలం కలసి రాక అడ్డంగా బుక్కయ్యాడు. కోట్ల రూపాయల ఆదాయం, కోట్లాది మంది అభిమానంతో సంతృప్తి పడక బుకీలు ఇచ్చే లక్షలకు కక్కుర్తిపడి అడ్డంగా దొరికిపోయాడు శ్రీశాంత్. ఇప్పడు ప్రతీ ఒక్క క్రికెట్ ప్రేమికుడూ శ్రీశాంత్ ను అసహ్యించుకుంటున్నారు. ఇంకేముంది సినీ కథకులకు, నిర్మాతలకు మంచి అవకాశం చిక్కింది. అతడి విషాధ గాథను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. అందరి కంటే ముందు మలయాళ చిత్ర నిర్మాత షాజి కైలాస్ 'క్రికెట్' అనే పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయిపోయారు. ఇందులో శ్రీశాంతే కథా వస్తువు అని వెల్లడైంది. ఇక బాలీవుడ్, టాలీవుడ్ నిర్మాతలు కూడా నేడో, రేపో శ్రీశాంత్ కథ ను ముడిసరుకుగా తీసుకుంటారేమో చూడాలి.