: వరల్డ్ కప్ ఫైనల్లో వెస్టిండీస్ మహిళలు
వెస్టిండీస్ జట్టు మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో ప్రవేశించింది. ఆస్ట్రేలియా జట్టుతో ముంబయి లో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టు జయభేరి మోగించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ అమ్మాయిలు 47 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటయ్యారు.
అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 48.2 ఓవర్లలో 156 పరుగులే చేసి ఓటమి పాలైంది. కాగా విండీస్ గెలుపు.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల ఫైనల్ ఆశలను తల్లకిందులు చేసింది. ఇక ఆదివారం ముంబయిలోనే జరిగే ఫైనల్లో వెస్టిండీస్.. మరోసారి ఆస్ట్రేలియాతో తలపడనుంది.