Telugudesam: మండలిని రద్దు చేసే అధికారం ఈ ముఖ్యమంత్రికి లేదు: చంద్రబాబునాయుడు
- నీ ఎమ్మెల్యేలు నీకు ఊడిగం చేస్తారు
- నువ్వు ఏం చెబితే అది ‘ఎస్’ అంటారు
- లేకపోతే నువ్వు తంతావో, ఏం చేస్తావోనని వారికి భయం
కౌన్సిల్ లో బిల్లులు పాస్ కాకపోవడాన్ని అవమానంగా భావిస్తున్నట్టు సీఎం జగన్ భావించడం దారుణమని, ఇది ప్రజాస్వామ్యం అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘నీకు (జగన్) ఊడిగం చేయడానికి ఎవరూ లేరు. నీ ఎమ్మెల్యేలు నీకు ఊడిగం చేస్తారు. నువ్వు ఏం చెబితే అది ‘ఎస్’ అంటారు. నువ్వు ఏమన్నా వాళ్లు పడతారు. రూమ్ లోకి పోతే నువ్వు తంతావో, ఏం చేస్తావోనని భయం. మీ వాళ్లందరూ వణికి పోతున్నారు.
తెలుగుదేశానికి ఆ దరిద్రం పట్టలేదు. వీరోచితంగా పోరాడతాం. నా దగ్గర ఏమన్నా చెప్పాలంటే నిర్మొహమాటంగా మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చెబుతారు. అందుకే, ప్రజాస్వామ్యయుతంగా మేము పనిచేస్తాం. మీ దగ్గర ఆ పరిస్థితి లేదు. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డికి చెప్పగలిగిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు మాట్లాడటం లేదు.. చెప్పలేకపోతున్నారు.
ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఒకటే కోరుతున్నా. మీరు అధైర్యపడొద్దు. మండలిని రద్దు చేసే అధికారం ఈ ముఖ్యమంత్రికి లేదు. తీర్మానం చేస్తే కేంద్రం ఆమోదించాలని ఎక్కడా లేదు.. మే ఆర్ మేనాట్. ఈ సందర్భంలో కేంద్రం కూడా అంగీకరించే పరిస్థితి ఉండదు. సెలెక్ట్ కమిటీ అవుట్ కమ్ కూడా రావాల్సిన అవసరం ఉందని ఏజీ అఫిడవిట్ ఫైల్ చేశారు. అక్కడ కూడా డ్రామా ఆడాలని చూశారు. ఫైనాన్షియల్ బిల్లుగా కన్వర్ట్ చేయాలని చూశారు. నిలదీస్తే ఆర్డరీ బిల్లుగా మార్చారు’ అని వైసీపీ నేతలపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.