Andhra Pradesh: టీడీపీ సభ్యుల తిట్లు భరించలేకపోతున్నాం: అసెంబ్లీలో గుడివాడ అమర్నాథ్
- ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు
- ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషం కక్కుతున్నారు
- అసెంబ్లీ ఒక దేవాలయం వంటిది
టీడీపీ సభ్యుల తిట్లు భరించలేకపోతున్నామని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నారని ఆయన విమర్శించారు. ఉత్తరాంధ్రపై చంద్రబాబు నాయుడు విషం కక్కుతున్నారని ఆరోపించారు.
కాగా, అసెంబ్లీ ఒక దేవాలయం వంటిదని వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ చెప్పుకొచ్చారు. ఇటువంటి దేవాలయంలో టీడీపీ సభ్యులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఇక్కడ ఎవరు ఎంతగా అరుస్తున్నారో చూసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం వారికి అన్ని ఎక్కువ మార్కులు వేస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి కాదని, పార్టీని లాక్కొని వచ్చిన వ్యక్తి అని ఆయన విమర్శలు గుప్పించారు.