Jagan: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: ఏపీ సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
- తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
- సంస్కృతీ సంప్రదాయాలకు మనమంతా ఇచ్చే గౌరవానికి ఈ పండుగ
- రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నాం
తెలుగువారందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతీ సంప్రదాయాలకు మనమంతా ఇచ్చే గౌరవానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆయన చెప్పారు.
తాము ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నామని వైఎస్ జగన్ తెలిపారు. సంక్రాంతి పండుగను ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని ఆయన అన్నారు.