YSRCP: విశాఖలో ఆస్తులపై వైసీపీ నేతల కన్ను: పంచుమర్తి అనురాధ
- లూలు గ్రూపునకు కేటాయించిన స్థలాన్ని రద్దు చేయించారు
- యలమంచిలిలో ఓ వైసీపీ నేత అక్రమంగా లేఔట్లు వేస్తున్నాడు
- వుడా చర్యలు తీసుకుంటే జైలుకి వెళ్తారు
వైసీపీ నేతలు విశాఖలో క్రిస్టియన్ ప్రాపర్టీలపై కన్నేశారని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ఆరోపించారు. లూలు గ్రూపునకు కేటాయించిన స్థలాన్ని రద్దు చేయించారని అన్నారు. యలమంచిలిలో ఓ వైసీపీ నేత అక్రమంగా లేఔట్లు వేస్తున్నాడని చెప్పారు. వుడా చర్యలు తీసుకుంటే జైలుకి వెళ్తారని అన్నారు.
విశాఖలో భూకబ్జాలపై సీబీఐ విచారణ జరపాలని అనురాధ డిమాండ్ చేశారు. నేరాల్లో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులు కొందరు విశాఖలో మూడు నెలల క్రితమే పాగా వేశారన్నారు. వీరంతా బోస్టన్ కమిటీకి లంచాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు.