: ధర్మానకు సీఎం పిలుపు.. తొలగింపేనా?


ఢిల్లీ పర్యటన నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చిన వెంటనే కళంకిత మంత్రిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మాన ప్రసాదరావును వెంటనే హైదరాబాద్ కు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరడం చర్చనీయాంశం అయింది. ముఖ్యమంత్రి కిరణ కుమార్ రెడ్డి ధర్మానకు ఫోన్ చేసి తక్షణం తనను కలవాలని కోరారు. రాత్రి వరకూ ధర్మాన శ్రీకాకుళంలోనే ఉన్నారు. సీఎం ఆదేశాలతో ఆయన తక్షణం హైదరాబాద్ కు బయల్దేరారు.

జగన్ అక్రమాస్తుల కేసులో ధర్మానతోపాటు హోంమంత్రి సబితపై అభియోగాలు నమోదై ఉన్నాయి. దీంతో మంత్రివర్గం నుంచి వీరి తొలగింపునకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ధర్మానను పిలవడంలోని ఆంతర్యం ఏమిటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, నిన్న ధర్మాన మద్దతు దారులు పార్టీని హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేసినందున పిలిచినట్లు కూడా భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News