: సన్ రైజర్స్ కు చావోరేవో
ఐపిఎల్ లో నేడు రెండు మ్యాచులు జరగనున్నాయి. హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య రాత్రి 8 గంటల నుంచీ హైదరాబాద్ లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ కు చాలా కీలకం. ప్లే ఆఫ్ రౌండ్ కు వెళ్లాలంటే సన్ రైజర్స్ నైట్ రైడర్స్ ను చిత్తు చేయాల్సి ఉంటుంది. ఇక పుణె వారియర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య సాయంత్రం 4 గంటల నుంచీ పుణెలో మ్యాచ్ జరుగుతుంది.