: శీతల పానీయాలు, ఫ్రూట్ పంచ్‌లతో కిడ్నీల్లో రాళ్లు
అతి సర్వత్ర వర్జయేత్ అని మన పెద్దాళ్లు ఎప్పుడో చెప్పేశారు. పళ్ల రసాలు ఆరోగ్యదాయకం అనుకుంటాం గానీ.. ఎక్కువైతే ముప్పే. శీతలపానీయాలు, ఫ్రూట్ పంచ్‌లు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు చేరే ప్రమాదం ఉన్నదని అధ్యయనకర్తలు చెబుతున్నారు. అయితే ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం అనేది.. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలని కూడా డాక్టర్లు సలహాలు చెబుతుంటారు. బోస్టన్‌లోని బ్రిగామ్ మరియు స్త్రీల ఆస్పత్రిలో పరిశోధకులు మాత్రం రకరకాల బివరేజెస్ వలన కొన్ని ప్రమాదాలు, ప్రయోజనాలు ఉన్నట్లు తేల్చారు. ఉదాహరణకు కాఫీ, టీ, బత్తాయి రసం వంటి వాటి వల్ల.. కిడ్నీల్లో రాళ్ల ప్రమాదం తక్కువ.
అదే సమయంలో తియ్యగా ఉండే.. శీతలపానీయలతో కిడ్నీలో రాళ్ల అవకాశం ఎక్కువౌతున్నట్లు అధ్యయనం నిర్వహించిన డాక్టర్ గేరీ కర్హన్ చెప్పారు. దాదాపు రెండు లక్షల మందిని 8 సంవత్సరాల పాటూ అధ్యయనం చేసి ఈ పరిశోదన ఫలితాలను నిగ్గుతేల్చామని వారు అంటున్నారు.