: పాతొక రోత.. కొత్తొక వింత అంటోన్న టాలీవుడ్ హీరోలు


టాలీవుడ్ హీరోలు ఇప్పుడు లొకేషన్ చేంజ్ అంటున్నారు. తమ సినిమాలను కొత్తకొత్త లొకేషన్లలో చిత్రీకరించేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. హాంకాంగ్, బ్యాంకాక్ బోరు కొట్టాయేమో.. ఇప్పుడందరూ జార్జియా, స్లొవేనియా, స్పెయిన్ వంటి యూరప్ దేశాలకు పరుగులు తీస్తున్నారు. అల్లు అర్జున్ నుంచి నాగార్జున వరకు అందరిదీ ఇదే బాట. పూరి దర్శకత్వంలో వస్తోన్న 'ఇద్దరమ్మాయిలతో..' సింహభాగం స్పెయిన్ లో షూట్ చేశారట. అక్కడి అందమైన లొకేషన్లు ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటాయని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక పవన్ కల్యాణ్ కూడా 'ఓవర్ టు స్పెయిన్' అంటున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'అత్తారింటికి దారేదమ్మా' చిత్రం త్వరలోనే బార్సిలోనాలో షూటింగ్ జరుపుకోనుంది. ఇప్పటికే త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ బార్సిలోనా పరిసరాలను చుట్టివచ్చారట. అందమైన లొకేషన్లు ఉండడంతో అక్కడే తమ తదుపరి షెడ్యూల్ చిత్రీకరించాలని వారిద్దరూ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇక ఇటీవల విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ 'బాద్షా' చిత్రం కూడా ఇటలీ అందాలను తెలుగు వీక్షకులకు పరిచయం చేసింది. ఆ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఇటలీలోని ప్రముఖ నగరాలైన మిలన్, రోమ్ లలో చిత్రీకరించారు.

  • Loading...

More Telugu News