: మలింగ వికెట్ల 'వంద'నం
శ్రీలంక విలక్షణ పేసర్ లసిత మలింగ ఐపీఎల్ లో 100 వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా అవతరించాడు. నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచ్ లో ప్రవీణ్ కుమార్ ను బౌల్డ్ చేయడం ద్వారా వందో వికెట్ ను ఖాతాలో వేసుకున్నాడీ యార్కర్ స్పెషలిస్ట్. కాగా, ఆ నూరు వికెట్లలో 46 బౌల్డ్ చేయడం ద్వారా దక్కినవే కావడం విశేషం. మ్యాచ్ అనంతరం మలింగ మాట్లాడుతూ, ఈ ఘనత సాధిస్తానని టోర్నీ ఆరంభంలో భావించనేలేదని చెప్పాడు. ఈ ప్రదర్శనకు మహేల జయవర్థనే కారణమని అన్నాడు. మహేల తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని అందించాడని తెలిపాడు.