: భారత్ కు పసిడి పంట
ఆసియా క్యారమ్ చాంపియన్ షిప్ లో భారత క్రీడాకారులు పసిడి పంట పండించారు. కోల్ కతాలో నేడు ముగిసిన ఈ టోర్నీలో అన్ని స్వర్ణాలు భారత క్రీడాకారులనే వరించాయి. ఈ టోర్నీలో పురుషుల, మహిళల విభాగాల్లో ఏడు అంశాలకు పోటీ జరగ్గా భారత్ క్లీన్ స్వీప్ చేయడం విశేషం.