: రానున్న ఎన్నికలే తెలంగాణకు చివరి పోరాటం: హరీష్ రావు
రానున్న ఎన్నికలే తెలంగాణకు చివరి పోరాటమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నిజామాబాద్ లో మాట్లాడుతూ ఆంధ్ర పార్టీలను ఆగంజేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటామని స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పరాభవం తప్పదన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆయన, వచ్చిన తెలంగాణను అడ్డుకున్న బాబుకు టీఆర్ఎస్ తో పాటూ కేసీఆర్ ను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. భవిష్యత్తులో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీల అడ్రెస్ గల్లంతవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. రఘునందన్ ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధమన్నారు. పథకం ప్రకారం కుట్రతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డ హరీష్ రావు తాటాకు చప్పుళ్లకు బెదిరే మనిషిని కాదన్నారు.