: జూలు విదిల్చిన 'ఒకే ఒక్కడు'
ఐపీఎల్-6లో ఆడుతున్న ఒకే ఒక్క పాకిస్తాన్ జాతీయుడు (బ్రిటన్ లో స్థిరపడ్డాడు) అజార్ మహమూద్. నేడు ముంబయి ఇండియన్స్ పై విరుచుకుపడ్డాడు. కెప్టెన్ గిల్ క్రిస్ట్ (5) నిరాశ పరిచినా.. మహమూద్ విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శించాడు. కేవలం 44 బంతుల్లోనే 80 పరుగులు సాధించి జట్టు భారీ స్కోరుకు బాటలు పరిచాడు. ఈ వెటరన్ ఆల్ రౌండర్ స్కోరులో 8 ఫోర్లు, 4 సిక్సులున్నాయంటేనే అర్థమవుతోంది ముంబయి బౌలర్లు ఎంత విలవిల్లాడారో. ఇక మహమూద్ కు తోడు షాన్ మార్ష్ (63) కూడా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 8 వికెట్లకు 183 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ పోరుకు హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మాశాల వేదిక.