cm: ఇదేనా మంచి సీఎం అనిపించుకునే విధానం?: జగన్ పై చంద్రబాబు ఆగ్రహం
- సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇంత అరాచకమా?
- పార్టీ మారకపోతే చంపుతారా?
- నిబ్బరంగా ఉందాం.. ధైర్యంగా ఎదుర్కొందామన్న బాబు
సీఎం జగన్ నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ఓ రైతును పార్టీ మారమంటూ దాడి చేశారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలపై ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఓ పోస్ట్ తో వీడియోను జతపరిచారు.
‘సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇంత అరాచకమా? పార్టీ మారకపోతే చంపుతారా? ఇదేనా మంచి సీఎం అనిపించుకునే విధానం?’ అంటూ మండిపడ్డారు. ప్రాణాలు పోయినా టీడీపీ జెండా వదిలేది లేదన్న కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. నిబ్బరంగా ఉందాం, ధైర్యంగా ఎదుర్కొందామని, అటు న్యాయపోరాటం, ఇటు రాజకీయ పోరాటం చేద్దామని చంద్రబాబు పిలుపు నిచ్చారు.