: స్నేక్ విలేజ్ లో సంబరాలు


పాము కనిపిస్తే చాలు.. 'అమ్మో పాము పాము' అని అరుస్తూ పరుగులు తీస్తాం. అదెక్కడ కాటేస్తుందేమోనని భయం. కానీ, పాములంటే అక్కడ బెదరరు. పాములను ప్రేమిస్తారు. ఇష్టంగా భుజిస్తారు. కోళ్ల పెంపకం, కుందేళ్ల పెంపకంలా.. నిర్భయంగా పాములను పెంచుకుంటుంటారు. 

ఈ పాములూరును చూడాలంటే చైనాలోని షాంఘైకు సమీపంలో ఉన్న జెజియాంగ్ ప్రాంతానికి వెళ్లాల్సిందే. అక్కడున్న 'జిసికియావో' అనే చిన్న గ్రామమే మనం చెప్పుకునే పాములూరు. ఈ గ్రామస్థులకు ఆకలి తీర్చేది పాములే. నాలుగు రూపాయలు సంపాదించి పెట్టేది పాములే!

అదెలా అంటే.. చైనీయులు పాములతో చేసిన వంటకాలను ఇష్టపడతారు. రెస్టారెంట్లలో రకరకాల పాములకు ఎంతో డిమాండ్ ఉంటుంది. అంతేకాదు అక్కడి సంప్రదాయ ఔషధాలలోనూ పాములకు డిమాండ్. దీంతో ఈ గ్రామం వారు పాములను పెంచుతూ విక్రయిస్తూ ఉంటారు. వీరికిదే ప్రధాన జీవనోపాధి. 
ఇక్కడ ఏ ఇంటికి వెళ్లి చూసినా 'బుస్ బుస్' మంటూ పాముల సందడి కనిపిస్తూ ఉంటుంది. 800 మంది పాముల పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఒకప్పుడు చేపల పెంపకం చేసుకుంటూ పొట్టపోసుకున్న ఈ గ్రామవాసులు ఆదాయం సరిపోక మూడు దశాబ్దాల క్రితం పాముల పెంపకాన్ని మొదలుపెట్టారు. నేడు చేతినిండా సంపాదిస్తున్నారు. 

చైనీయులకు రెండు రోజుల క్రితమే నూతన సంవత్సరం ప్రారంభం అయ్యింది. రాశి చక్రం ప్రకారం ఈ సంవత్సరానికి నీరు, పాము అధిదేవతలని చైనీయులు భావిస్తారు. అసలే పాములను నమ్ముకుని బతుకుతున్నారు. పైగా ఈ సంవత్సరం పాములకు ప్రత్యేకం కావడంతో జిసికియావో గ్రామస్థుల సంబరాలు అంబరాన్నంటాయి.

  • Loading...

More Telugu News