: కళంకిత మంత్రుల తొలగింపునకు సీఎంకు గ్రీన్ సిగ్నల్


రాష్ట్ర మంత్రివర్గంలోని కళంకిత మంత్రులను తొలగించే భారాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపైనే పెట్టింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నందున కళంకితులను తొలగిస్తే పార్టీపై పడే ప్రభావం, పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని అధిష్ఠానం ముఖ్యమంత్రికి సూచించింది. మొత్తానికి ప్రభుత్వ, పార్టీ అవసరాలు, పరిణామాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని చెప్పింది.

ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈ ఉదయం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ అజాద్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా కళంకిత, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నిన్న అధినేత్రి సోనియాతో సమావేశం సందర్భంగానూ మంత్రుల తొలగింపు వ్యవహారం చర్చకు వచ్చింది.

అయితే, మేడం సూచనతో ముఖ్యమంత్రి కిరణ్ నిన్న రాత్రి అజాద్ తో భేటీ అయి చర్చించారు. మళ్లీ ఈ ఉదయం అజాద్ తో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రికి పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. జగన్ అక్రమాస్తుల కేసు, వైఎస్ హయాంలో పలు కంపెనీలు, వ్యక్తుల లబ్ధి కోసం జారీ చేసిన అక్రమ జీవోల వ్యవహారంలో మంత్రులు సబిత, ధర్మాన ప్రసాదరావు, పొన్నాల లక్ష్మయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News