: క్రికెటర్లకు అమ్మాయిలను ఎరగా వేసి.. వీడియో తీసి...!


ముగ్గురు క్రికెటర్లు శ్రీశాంత్, చండీలా, అంకిత్ చవాన్ తో స్పాట్ ఫిక్సింగ్ కథ నడిపిన బుకీలు చాలా తెలివిగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. వీరికి డబ్బులతోపాటు యువతులతో ఆనందకేళికి ఏర్పాట్లు చేసినట్లు విచారణలో బయటపడిన సంగతి తెలిసిందే. అయితే, ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో బుకీలు... క్రికెటర్లు యువతులతో గడుపుతున్న కార్యక్రమాన్ని వీడియో తీయాలని చూశారట. రేపు క్రికెటర్లు అడ్డం తిరిగితే వీడియోలతో ఆట కట్టించాలన్నది బుకీల పన్నాగం.

అందుకే బుకీల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ ట్యాపులను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పోలీసులు పంపించారు. అక్కడి నుంచి నివేదిక వస్తే గానీ వాటిలో ఉన్న రహస్య సమాచారం వెలుగు చూడదు. ఒకవేళ యువతులతో గడుపుతున్న దృశ్యాలు వీడియోలో బంధించి ఉంటే క్రికెటర్లకు మరిన్ని కష్టాలు తప్పవు. శ్రీశాంత్, అజిత్ చండీలా దగ్గరకు యువతులను పంపించామని బుకీలు చంద్రేష్ పటేల్ అలియాస్ చాంద్, మనాన్ విచారణలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News