Telugudesam: కోడెల మృతిపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలి: అంబటి రాంబాబు
- కోడెల మృతిపై రకరకాల వార్తలు వస్తున్నాయి
- ‘ఆత్మహత్య’ అని, ‘గుండెపోటు’ అని అంటున్నారు!
- కోడెలది వివాదాస్పద మరణంలా కనిపిస్తోంది
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుది అనుమానాస్పద మృతిలా కనిపిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కోడెల మృతి చాలా బాధాకరమని, ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నట్టు చెప్పారు. కోడెల మృతిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయని, ‘ఆత్మహత్య’ అని కొందరు, ‘గుండెపోటు’ అని మరికొందరు అంటున్నారని అన్నారు. కోడెలది వివాదాస్పద మరణంలా కనిపిస్తోందని, దీనిపై తక్షణమే తెలంగాణ సర్కార్ సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.