Telugudesam: చట్టం వైసీపీకి చుట్టం అయిందా?: చంద్రబాబునాయుడు
- ఒక్క టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైనే వేధింపులా?
- వాళ్లను బెదిరించే వైసీపీ వాళ్లపై చర్యలు ఉండవా?
- ‘ఇదేనా రాజన్న రాజ్యం?’ అని ప్రశ్నిస్తే కేసు పెడతారా?
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వేధింపులపాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైనే వేధింపులా? వాళ్లను బెదిరించే వైసీపీ వాళ్లపై చర్యలు ఉండవా? చట్టం వైసీపీకి గత 100 రోజుల్లో చుట్టం అయిందా? ‘151మేకలు, 23 పులులు’ అని పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తారా? ‘నా భూమిని కబ్జా చేశారు. ఇదేనా రాజన్న రాజ్యం?’ అని ప్రశ్నిస్తే కేసు పెడతారా? అంటూ ఓ ట్వీట్ లో చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.