Chandrababu: దేన్నయినా సహిస్తాం కానీ పేదల జోలికి వస్తే మాత్రం ఖబడ్దార్!: చంద్రబాబు ఆగ్రహం
- ఏపీ సర్కారుకు చంద్రబాబు హెచ్చరిక
- పేదలకు అన్యాయం జరుగుతుంటే టీడీపీ చూస్తూ ఊరుకోదంటూ ట్వీట్
- ఇసుక కొరతతో లక్షల మందికి ఉపాధి లేకుండా చేశారని మండిపాటు
రాష్ట్రంలో ఇసుక కొరత నెలకొందంటూ టీడీపీ తీవ్రస్థాయిలో నిరసన గళం విప్పిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ అంశంపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. దేన్నయినా సహిస్తాం కానీ, పేదల జోలికి వస్తే మాత్రం ఖబడ్దార్ అంటూ ఏపీ సర్కారును హెచ్చరించారు. పేదలకు అన్యాయం జరుగుతుంటే టీడీపీ చూస్తూ ఊరుకోదని ట్వీట్ చేశారు. ఇసుక కొరత కారణంగా లక్షల మంది పేదవాళ్ల ఉపాధి మార్గాలను కూల్చివేశారని, ఆఖరికి వాళ్ల ఇళ్లను కూడా కూల్చివేసి నిలువ నీడలేకుండా చేస్తారా? అంటూ మండిపడ్డారు.