: బీజేపీ ఒక రాష్ట్రానికి పరిమితమవుతుంది: రాహుల్


భారతీయ జనతాపార్టీ నేడు జాతీయ స్థాయిలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న విషయం దేశ ప్రజలందరికీ తెలుసు. కేంద్రంలో ఐదేళ్ల పాటు భాగస్వామ్య పక్షాలతో పాలన కూడా అందించింది. అలాంటి పార్టీ త్వరలోనే ఒక రాష్ట్ర పార్టీగా మారుతుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెలవిచ్చారు. రాజస్థాన్ పర్యటనలో చివరిరోజైన శుక్రవారం రాహుల్ ఈ మేరకు పార్టీ కార్యకర్తలతో జైపూర్ లో మాట్లాడారు.

"బీజేపీ తనది జాతీయ పార్టీ అని చెప్పుకుంటోంది. నిజమేమిటంటే ఆ పార్టీ నాలుగు రాష్ట్రాలు.. గుజరాత్, గోవా, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లోనే ప్రభుత్వాలను కలిగి ఉంది" అన్నారు రాహుల్. త్వరలో మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్ అక్కడ బీజేపీని అధికారం నుంచి దింపేస్తుందన్నారు. ఇక గోవాలో ప్రతీ ఆరు నెలలకు అధికారం కొత్త పార్టీల చేతుల్లోకి పోయే ఆచారం ఉందని చెప్పారు. చివరికి గుజరాత్ లో మాత్రమే బీజేపీ కనిపిస్తుందని.. అప్పుడు అది జాతీయ పార్టీ ఎలా అవుతుందని రాహుల్ తెలివిగా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News