Chandrababu: భద్రత కుదింపుపై చంద్రబాబు పిటిషన్... తీర్పును రిజర్వ్ లో ఉంచిన ధర్మాసనం
- కొత్త ప్రభుత్వం రాకతో చంద్రబాబు భద్రత కుదింపు
- హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ సీఎం
- జూలై 10న తొలి విచారణ
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తన భద్రతను కుదించారంటూ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పిటిషన్ పై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. కొద్దిసేపటి క్రితమే వాదనలు ముగిశాయి. కాగా ఈ వ్యవహారంలో జూలై 10న తొలి విచారణ జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు భద్రతా బృందం నుంచి ఇద్దరు ప్రధాన అధికారులను, వారి ఆధ్వర్యంలో పనిచేసే మరో 15 మందిని తొలగించారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.