Andhra Pradesh: దేశ చరిత్రలో ఈరోజు సుదినం: వైఎస్ జగన్
- శాశ్వత బీసీ కమిషన్ సహా, పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకు
- ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు
- అక్కాచెల్లెమ్మలకు 50 శాతం కేటాయించాం
ఏపీ అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ ఓ ట్వీట్ చేశారు. దేశ చరిత్రలో ఇలాంటి బిల్లులు ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారని, ఈరోజు సుదినమని అన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, పనులు, సర్వీసుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, అక్కాచెల్లెమ్మలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించామని చెప్పారు. శాశ్వత బీసీ కమిషన్ సహా, పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా అసెంబ్లీలో బిల్లులు ప్రవేశ పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు.