: అనకాపల్లిలో టీడీపీకి లీడర్ కరవు
అనకాపల్లి టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ భవన్ కు తరలి వచ్చారు. కొద్ది రోజుల క్రితం అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలోకి వెళ్లిపోయారు. అంతకు ముందే పాయకరావు పేట నుంచి చెంగల వెంకట్రావు వైఎస్సార్ సీపీ లోకి వెళ్ళిపోయారు. దీంతో అనకాపల్లి నియోజకవర్గానికి టీడీపీకి నాయకుడు లేక పార్టీ దిక్కులేనిదైపోయిందని బాబుకు కార్యకర్తలు విన్నవించుకున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో ముందంజ వేసేందుకు ఏం చేయాలో కార్యకర్తలకు బాబు వివరించారు. స్థానిక సమస్యలపై మరింత ఆరాతీసారు. 'నేనున్నా ... మరేం ఫర్వాలేదు ధైర్యంగా ఉండండంటూ' బాబు వారికి భరోసా ఇచ్చారు.