Narendra Modi: మోదీకి జగన్ పాదాభివందనం చేయడంలో తప్పులేదు, కానీ..!: ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ విశ్లేషణ

  • మోదీ పెద్దరికానికి నమస్కారం చేశాడేమో!
  • ఆనాడు లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పెట్టారు
  • అప్పటికి, ఇప్పటికి ఏం మారిందని మోదీకి పాదాభివందనం చేశారు?

ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల పర్యటన సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలకడం తెలిసిందే. అయితే రేణిగుంట విమానాశ్రయంలో ప్రధాని విమానం దిగగానే ఆయన కాళ్లకు నమస్కరించేందుకు జగన్ విఫలయత్నాలు చేశారు. పాదాభివందనం చేసేందుకు జగన్ కిందికి వంగడం, సగంలోనే మోదీ అడ్డుకోవడం రెండు సార్లు జరిగాయి. దాంతో ఆయనకు పూర్తిస్థాయిలో పాదాభివందనం చేయకుండానే జగన్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, దీనిపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ స్పందించారు.

నరేంద్ర మోదీ వయసులో పెద్దవాడు, అత్యున్నత పదవిలో ఉన్నవాడు కావడంతో జగన్ విధేయత ప్రకటించే క్రమంలో పాదాభివందనం చేయడానికి ప్రయత్నించి ఉంటాడని తెలిపారు. అందులో ఎలాంటి తప్పులేదని అన్నారు. అయితే, కొన్నినెలల కిందటే పార్లమెంటులో ఇదే నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టిన వైసీపీ అంతలోనే తన వైఖరి మార్చుకుందా? అని నాగేశ్వర్ ప్రశ్నించారు. అప్పుడు చెడ్డవాడుగా కనిపించిన మోదీ, ఇప్పుడు మంచివాడుగా కనిపిస్తున్నాడా? అని అడిగారు.

"ఆరోజు అవిశ్వాసం ఏంటి? ఈరోజు పాదాభివందనం ఏంటి? అప్పటికీ ఇప్పటికీ మారింది ఏంటి? ఈ మధ్యకాలంలో మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిందేంటి? అంటూ తనదైన శైలిలో పరిస్థితిని విశ్లేషించారు.

  • Loading...

More Telugu News