Telangana: కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు: భట్టి విక్రమార్క

  • రాజ్యాంగ సంక్షోభంగా రాష్ట్రపతి భావించాలి
  • ఫిరాయింపుదారుల సభ్యత్వం రద్దుకు సవరణ తేవాలి
  • అప్పటి వరకూ నా పోరాటం ఆగదు

టీఆర్ఎస్ లో చేరిన పన్నెండు మంది కాంగ్రెస్ శాసనసభ్యుల సభ్యత్వ రద్దు చేసే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని టీ- సీల్పీ నాయకుడు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సీఎల్పీ విలీనాన్ని ఖండిస్తూ ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద ‘ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం’ పేరుతో  36 గంటల దీక్ష కొనసాగుతోంది. రెండో రోజు దీక్షలో పాల్గొన్న భట్టి మీడియాతో మాట్లాడుతూ, పన్నెండు మంది కాంగ్రెస్ శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసి తిరిగి ఆయా స్థానాల్లో ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు.

అలాగే, ప్రజాస్వామ్య పరిరక్షణపై విస్తృతంగా చర్చ జరగాలని, ఫిరాయింపులకు పాల్పడ్డ శాసనసభ్యుల సభ్యత్వం వెంటనే రద్దు అయ్యేట్టుగా సవరణ తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ లో ఆ సవరణ తీసుకువచ్చే వరకూ తన పోరాటం కొనసాగుతుందని భట్టి స్పష్టం చేశారు. ఇందుకు ప్రజాస్వామ్యవాదులందరూ సహకరిస్తారని భావిస్తున్నానని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, దీనిని రాజ్యాంగ సంక్షోభంగా భారత రాష్ట్రపతి భావించి ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News