Jagan: సీఎం జగన్ శాఖలవారీ సమీక్షల షెడ్యూల్ ఇదే!
- రేపటి నుంచి సమీక్షలు జరపనున్న జగన్
- ఆర్థిక, రెవెన్యూ శాఖలతో సమీక్షలు మొదలు
- ఉదయం, మధ్యాహ్నం సమీక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన జగన్ రేపటి నుంచి శాఖలవారీగా సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఓ అవగాహనకు వచ్చేందుకు ఈ సమీక్షలు ఉపయోగపడతాయని జగన్ భావిస్తున్నారు. కాగా, పరిపాలనలో ఎంతో కీలకమైన ఆర్థిక, రెవెన్యూ శాఖల సమీక్షను రేపు చేపడతారు.
ఇతర శాఖల సమీక్షల వివరాలు
- జూన్ 3 ఉదయం-విద్యాశాఖ
- జూన్ 3 మధ్యాహ్నం-జలవనరుల శాఖ
- జూన్ 4 ఉదయం-వ్యవసాయం, అనుబంధ రంగాలు
- జూన్ 4 మధ్యాహ్నం-గృహనిర్మాణ శాఖ
- జూన్ 6-సీఆర్డీయే శాఖ