Andhra Pradesh: వైసీపీ నేతల కంటే రైతులు, సామాన్యులు ఎక్కువ సంబరాలు చేసుకుంటున్నారు!: ఎమ్మెల్యే ఆర్కే
- రాజన్న రాజ్యం రాబోతోంది
- ఇందుకోసం రైతులు, పేదవాళ్లు ఎదురుచూశారు
- విజయవాడలో మీడియాతో మంగళగిరి ఎమ్మెల్యే
ప్రస్తుతం ఏపీలో వైసీపీ నేతల కంటే రైతులు, సామాన్యులు, పేదవారు ఎక్కువ సంబరాలు చేసుకుంటున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. గత పదేళ్లుగా రాజన్న రాజ్యం కోసం ప్రతీ రైతు, పేదవాడు ఎదురు చూశాడని వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు.
సీనియర్ నేత అయిన చంద్రబాబు రాజన్న రాజ్యాన్ని తెస్తాడని ప్రజలు అశించారనీ, అందుకే ఆయన్ను గెలిపించారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు దోపిడీకి తెరలేపడంతో ఆయన్ను ఓడించారని చెప్పారు. అనంతరం జగన్ కు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. ఏపీ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే విషయంలో జగన్ నిక్కచ్చిగా ఉన్నారని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.