: ఈ వజ్రం చాలా 'విలువైంది'!
వజ్రం ఎప్పటికీ నిలిచి వుంటుంది... అంటూ ఒక కంపెనీవారు ప్రచారం చేస్తుంటారు. అయితే ఈ వజ్రం మాత్రం చాలా విలువైంది అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే, మరి ఈ వజ్రం అంత ఖరీదైంది కాబట్టి. స్వచ్ఛమైన వజ్రానికి రంగు ఉండదంటారు. అలా ఎలాంటి రంగులేకుండా స్వచ్ఛంగా కాంతులీనుతున్న ఒక వజ్రానికి ప్రఖ్యాత వేలం సంస్థ క్రిస్టీస్ నిన్నటి రాత్రి వేలం నిర్వహించింది. ఈ వేలం పాటలో ఈ రంగులేని వజ్రాన్ని రూ.117 కోట్లకు పాడుకున్నారట. రంగులేని స్వచ్ఛమైన వజ్రానికి ఇంత పెద్ద ధర పలకడం ఇదే మొదటిసారని క్రిస్టీస్ సంస్థ చెబుతోంది. నిజమే మరి... స్వచ్ఛమైన వాటికి ఎప్పటికీ విలువుంటుంది...!