: అల్జీమర్స్ ను ముందే కనుక్కోవచ్చు...!


వయసు పెరిగే కొద్దీ కొద్దిమందిలో బయటపడే వ్యాధి అల్జీమర్స్‌. చూసింది ఏదీ గుర్తు లేకపోవడం... చివరికి కన్న బిడ్డలను కూడా గుర్తుపట్టలేకపోవడం ఈ వ్యాధి లక్షణాలు. ఇలాంటి వ్యాధి గురించి ముందే పసిగట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వెన్నుపాము ద్రవం నమూనాలను అధ్యయనం చేసి అల్జీమర్స్‌ను గుర్తించే వివిధ జీవసూచికలను వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కనుగొన్నారు. ఈ జీవసూచికల ఆధారంగా అల్జీమర్స్ వ్యాధి లక్షణాలను ఆ వ్యాధి బయటపడడానికి కొన్ని సంవత్సరాలకు ముందే పసిగట్టవచ్చని ఒక అధ్యయనంలో నిరూపించారు.

ఈ జీవసూచికల ఆధారంగా భవిష్యత్తులో ఈ వ్యాధి బారిన పడే వారిని గుర్తించేందుకు తాము కనుగొన్న జీవసూచికలు బాగా ఉపయోగపడతాయని, భవిష్యత్తులో ఈ వ్యాధి వస్తుందని ముందే తెలిస్తే దానికి చికిత్స చేయడానికి, లేదా తగ్గించడానికి తాము కనుగొన్న జీవసూచికలు ప్రధాన పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి భయంకరమైన వ్యాధి గురించి ముందుగానే తెలిస్తే మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉంటాం కదా...!

  • Loading...

More Telugu News