bhanuchanda5r: ఇప్పటి సినిమాల్లో సెంటిమెంట్ అనేది తగ్గిపోయింది: సీనియర్ హీరో భానుచందర్
- జనరేషన్ మారిపోయింది
- ఓవరాక్షన్ అంటున్నారు
- ఎంటర్టైన్మెంట్ నే ఇష్టపడుతున్నారు
తాజా ఇంటర్వ్యూలో భానుచందర్ మాట్లాడుతూ ఒకప్పటి సినిమాలకి .. ఇప్పటి సినిమాలకి మధ్యగల తేడాలను గురించి ప్రస్తావించారు. అప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పులను గురించి స్పందించారు. " ఒకప్పుడు శివాజీ గణేశన్ గారు అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చేవారు. ఆయనతో పోల్చుకుంటే మా నటన ఎంత అనుకునేవాళ్లం.
కానీ ఈనాటి జనరేషన్ .. ఒకప్పటి మాదిరిగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తే, ఓవరాక్షన్ అంటున్నారు. 'అంత అవసరమా' అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక అప్పటి సినిమాలతో పోల్చితే ఇప్పటి సినిమాల్లో సెంటిమెంట్ శాతం బాగా తగ్గిపోయిందనే చెప్పాలి. రాన్రాను ఇంకా తగ్గిపోతూ వస్తోంది. ప్రతి విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటోన్న ఈ జనరేషన్ .. సెంటిమెంట్ సీన్స్ పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదు. వాళ్లు ఎక్కువగా ఎంటర్టైన్ మెంట్ నే కోరుకుంటున్నారు" అంటూ చెప్పుకొచ్చారు.