KCR: రాష్ట్రం నుంచి బయటికెళ్లి షికార్లు చేయడానికి ఫెడరల్ ఫ్రంట్ పేరుతో నాటకాలు ఆడుతున్నారు: కేసీఆర్ పై కోదండరాం ధ్వజం

  • ప్రజా సమస్యలపై కేసీఆర్ దృష్టిపెట్టాలి
  • ఫెడరల్ ఫ్రంట్ అనేది జరగని పని
  • సమయం వృథా తప్ప ఏమీ ప్రయోజనంలేదు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కీలక సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో షికార్లు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రం నుంచి బయటికెళ్లి షికార్లు చేయడానికి ఫెడరల్ ఫ్రంట్ పేరుతో నాటకాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది జరగని పని అని స్పష్టం చేసిన కోదండరాం, ఫ్రంట్ పేరుతో సమయం వృథా చేసుకోకుండా ప్రజల కష్టాలకు పరిష్కారాలు ఆలోచించాలని హితవు పలికారు.

పదో తరగతి ఫలితాలు సకాలంలో విడుదల చేయడం, వాతావరణ మార్పుల నేపథ్యంలో పెరుగుతున్న ఎండలపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వంపై ఉందన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత మహాకూటమి కీలకపాత్ర పోషిస్తుందని, ఫెడరల్ ఫ్రంట్ లో కేసీఆర్, జగన్ మాత్రమే ఉంటారని కోదండరాం ఎద్దేవా చేశారు. కేసీఆర్, జగన్ మినహా దేశంలోని అనేక పార్టీల నేతలు మహాకూటమి కోసం చేతులు కలిపారని అన్నారు.

  • Loading...

More Telugu News