: ఇంటిదారి పట్టిన 'కోల్ కతా'
ఐపీఎల్-6లో కోల్ కతా నైట్ రైడర్స్ ప్రస్థానం ముగిసింది. నేడు పుణే వారియర్స్ చేతిలో 7 పరుగుల తేడాతో ఓడింది. రాంచీలో జరిగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పుణే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఆ జట్టులో మనీష్ పాండే 66, కెప్టెన్ ఆరోన్ ఫించ్ 48, యువరాజ్ సింగ్ 30 పరుగులు చేశారు. ఇక లక్ష్యఛేదనలో కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులే చేసింది. యూసుఫ్ పఠాన్ (72), టెన్ డష్కాటె (42) పోరాటం నిష్ఫలమే అయింది. కాగా, ఈ మ్యాచ్ లో గెలిచి ఉంటే, కోల్ కతా జట్టుకు ఇతర మ్యాచ్ ల ఫలితాలపై ఆధారంగా, ప్లే ఆఫ్ అవకాశాలు స్వల్పంగా ఉండేవి. ఈ ఓటమితో అన్ని దారులు మూసుకుపోయాయి.